Gandhi Hospital | నిరుద్యోగులను వెంబడించిన పోలీసులు.. మెట్రో స్టేషన్లోకి పరుగెత్తిన విద్యార్థులు.. వీడియో
Gandhi Hospital | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిరసనగా వచ్చిన నిరుద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు.
Gandhi Hospital | హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిరసనగా వచ్చిన నిరుద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు. నిరుద్యోగుల వైపు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు దూసుకెళ్లి వెంబడించారు. దీంతో నిరుద్యోగ యువతీయువకులు అక్కడున్న మెట్రో స్టేషన్లోకి పరుగెత్తారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసుల తీరు సరిగా లేదని నిరుద్యోగులు మండిపడ్డారు.
ఇక మరోవైపు గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల వైపు నుంచి కొంత మంది విద్యార్థులు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు హాస్టల్ భవనాల వద్ద ఉన్న క్యాంటీన్ వైపు వెళ్లి నిరుద్యోగులను అడ్డుకున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలోనే కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
అనంతరం నిరుద్యోగులను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థులను వెంబడిస్తున్న పోలీసులు.. మెట్రో స్టేషన్లోకి పరిగెత్తిన నిరుద్యోగులు. pic.twitter.com/JUqyDJzPQa
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
DSC వాయిదా వేయాలంటు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/sv94LSJ58A
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
DSC వాయిదా వేయాలంటు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/sv94LSJ58A
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
రెండు నెలల్లో మెగా DSC వేస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడు
ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలే వీళ్ళు ఇచ్చినం అని చెప్పుకుంటున్నారు. pic.twitter.com/uRNDOje9uk
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

