హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులు కృతిమ మేధ(ఏఐ)పై తప్పనిసరిగా అవ గాహన పెంపొందించుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఇందుకు మీడియా అకాడమీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. బుధవారం నాంపల్లిలో మీడియా అకాడమీ, అదిరా డాటా లీడ్స్ ఆధ్వర్యంలో ఏఐ టూల్స్, టెక్నిక్స్‌పై వర్క్‌షా ప్ నిర్వహించారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం లో కూడా ఏఐని విస్తృతంగా వాడుతున్నారని చెప్పారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏఐని ఉపయోగించుకొని తకువ సమ యంలోనే ఎకువ అంశాలను పాఠకులకు, వీక్షకులకు అందించవచ్చని సూచించారు. అనంతరం కృత్రిమ మేధ టూల్స్, టెక్నిక్స్‌పై ఏఐ ఇంటర్నేషనల్ ట్రైనర్ ఉడుముల సుధాకర్‌రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.