ఇండస్ట్రియల్ కారిడార్లకు దక్కని చోటు
ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మధ్యంతర బడ్జెట్లో కారిడార్ల ఊసేలేదు. రాష్ర్టానికి బహుళ ప్రయోజనాలు ఉండటంతో ఎలాగైనా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ సర్కారు ఎప్పుడో ప్రతిపాదించింది. ఇందులో నాగపూర్-హైదరాబాద్, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ కారిడార్లున్నాయి.
నాగపూర్-హైదరాబాద్‌కు గతంలోనే కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ తుది అనుమతులు రావాల్సి ఉన్నది. కాగా, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ కారిడార్లకు ఇంతవరకు కేంద్రం నుంచి ఎటుంటి అనుమతి రాలేదు. నిజానికి అనేకసార్లు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి రకరకాలుగా విజ్ఞప్తి చేసింది. అయినా.. తెలంగాణపట్ల తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వీటికి అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు బడ్జెట్లోనూ చుక్కెదురైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

