హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ కాన్సులేట్ వినూత్న ఆలోచన చేసింది. ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్‌గా ఉండే అవకాశాన్ని మన దేశ యువతులకు అందిస్తున్నది. 18 నుంచి 23 ఏండ్ల వయస్సు గల భారతీయ మహిళలకు యూకే అగ్ర దౌత్యవేత్తల్లో ఒకరిగా ఒక రోజు గడిపే అవకాశాన్ని కల్పించనున్నది.
ఈ పోటీలో పాల్గొనేవారు తప్పనిసరిగా ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో యువత ఎలా సహాయపడగలరు’ అనే అంశంపై ఒక నిమిషం నిడివి గల వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారులను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో ‘@UKinIndi a’ని ట్యాగ్ చేయాలి. ‘#Day Of TheGirl’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ఉపయోగించాలి. 18లోపు ఎంట్రీలు ఆన్లైన్లో పంపాలని భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కోరారు.