హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ను ఉగాండా ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ మేరకు ఈ బృందం రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరు, స్వయం సహాయక, రైతులకు రుణాల పంపిణీపై అధ్యయనం చేయనుంది. ఉగాండాలో పొదుపు సంఘాలను ప్రోత్సహించడం కోసం కేర్ (కో-ఆపరేటివ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎవ్రివేర్) వారి సహాయంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ నేతి మురళీధర్ ఇక్కడ అమలు చేస్తున్న విధానాలను వారికి వివరించారు.