హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుపడ్డారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. దీంతో అది అక్రమమని పేర్కొంటూ అతడి నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారిణి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ రూ.75వేలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సదరు నిర్మాణదారుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని వారిద్దరిని పట్టుకున్నారు. వాణి, సుదర్శన్‌ను అరెస్టు చేసిన అదనపు స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా, విచారణ జరిపిన జడ్జి వారికి రిమాండ్ విధించారు.