మిర్యాలగూడ రూరల్, జనవరి 1: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని ఐలాపురం గ్రామం వద్ద బుధవారం నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వలో పడి ఇద్దరు ఇంజినీర్లు గల్లంతయ్యారు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై-2 సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండ లం తాళ్లవీరప్పగూడెం శివారులో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కాంట్రాక్టర్ కింద పనిచేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన 8మంది ఇంజినీర్లు బొలెరో వాహనంలో ఎడమ కాల్వ వద్దకు వచ్చారు. స్నానం చేసేందుకు కాల్వలోకి దిగారు. ఇద్దరు ఇంజినీర్లు కార్తీక్ మిశ్రా (24), విజయ్ గోస్వామి (25) నీటి ప్రవాహానికి కాల్వలో కొట్టుకుపోయారు. తోటి ఇంజినీర్లు గమనిం చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం 100 నంబర్‌కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా ఆచూకీ లభించలేదని ఎస్సై తెలిపారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? ; దౌల్తాబాద్ కేజీబీవీ పీఈటీ అనితకు గుండెపోటు
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి ఆగ్రహం వ్యక్తంచేశారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదనే మనోవేదనతో సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ కేజీబీవీ పీఈటీ డీ అనితకు దీక్షా శిబిరంలో గుండెపోటు వచ్చిందని బుధవారం ఆయన ప్రకటించారు. సమ గ్ర శిక్షా ఉద్యోగులకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తమ డిమాండ్లకు పరిష్కారం ల భించడంలేదనే బాధతో ఇప్పటికే ముగ్గు రు ఉద్యోగులు చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను రెగ్యులరైజ్ చేస్తూ పేస్కేల్ అమ లు చేయాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.