నిజామాబాద్: జిల్లాలోని మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను కిసాన్‌నగర్‌కు చెందిన మేస్త్రీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.