నిర్మల్ అర్బన్, ఆగస్టు 24 : ఓ వ్యాపారి కి పన్ను తగ్గించేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ డీటీసీవో, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు దొరికారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన ఓ వ్యాపారి పన్ను తగ్గించేందుకు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయ డీటీసీవో గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు.
తరువాత రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నారు. సోమవారం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో బాధితుడి నుంచి డీటీసీవో గోదావరి రూ.50 వేలు లంచం తీసుకొని సీనియర్ అసిస్టెంట్ సాయికృష్ణకు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.