‘టెస్కాబ్’ హ్యాక్ నైజీరియన్ల పనే

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) సర్వర్‌ను హ్యాక్ చేసింది నైజీరియన్ సైబర్ నేరగాళ్లేనని జాయింట్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియన్ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ టోలిచౌక్‌లో ఉండే ఆ దేశస్తుడికి టెస్కాబ్‌లో ఖాతాలు తెరిపించే బాధ్యతను అప్పగించారు. తనకు భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నాయని, టెస్కాబ్‌లో పొదుపుఖాతాలు కావాలని, డిపాజిట్ అయిన డబ్బులో 10 శాతం కమీషన్ ఇస్తానని అతడు చందానగర్‌కు చెందిన సోదరులు యాసిన్ పాషా, మహ్మద్ రఫీని నమ్మించాడు. వారి చిరునామాతో చందానగర్ బ్రాంచ్‌లో రెండు ఖాతాలు తెరిచారు. సికింద్రాబాద్ బ్రాంచ్‌లో సుప్రియ పేరుతో మరో ఖాతా తెరిపించారు. సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను హ్యాక్‌చేసి బ్యాంకు ప్రధాన ఖాతాలో నుంచి ఈ మూడు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేందుకు యత్నించారు. ఈ నెల 7న సుప్రియ ఖాతాలోకి రూ.1.94 కోట్లు బదిలీ చేసినవారు.. మరో దఫాలో రఫీ, పాషాఖాతాల్లోకి రూ.50 లక్షల చొప్పున బదిలీకి యత్నించారు. ఆ రోజు బ్యాంకుకు సంబంధించిన నగదు డ్రా పరిమితి రెండు లక్షలే ఉండటంతో. దీంతో పాషా ఖాతాలోకి రూ.2 లక్షలు బదిలీ అయ్యాయి. సుప్రియ ఖాతాలో నుంచి హర్యానా, ఢిల్లీ, మహారాష్ట, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని వివిధ బ్యాంకుల ఖాతాల్లోకి డబ్బు మళ్లించారు. పాషా ఖాతాలోని రూ.2 లక్షలు స్థానికంగా ఉండే నైజీరియన్ తీసుకుని.. రూ. 20 వేలు పాషా, రఫీకి కమీషన్‌గా అందించాడు. హ్యాకర్లు 102 బ్యాంకు లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. పాషా, రఫీని అరెస్ట్ చేశారు. సుప్రియ, నైజీరియన్‌తోపాటు సైబర్ ముఠా కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

