శ్రీనగర్: భారత సైన్యం 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి కమాండోలు దక్షిణ కశ్మీర్‌లోని కొకెర్నగ్ ప్రాంతంలోని గడోల్ అడవిలో అదృశ్యమయ్యారు. ఓ సంయుక్త ఆపరేషన్ సందర్భంగా ఈ నెల 6న వారు దట్టమైన అడవిలో కనిపించకుండా పోయారు. వారి కోసం ఆర్మీ, పోలీసులు గాలిస్తున్నారు.
గడోల్ అడవి లోతైన లోయలు, నిటారుగా ఉండే వాలు ప్రాంతాల్లో కూడిన ప్రాంతం. గతంలో ఈ అడవి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నెలవు. ఈ నెల 6న భారీగా మంచు కురవడంతో అదృశ్యమైన వారి గాలింపు క్లిష్టమైంది. వారి అదృశ్యం వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలను సైన్యం కొట్టిపారేసింది.