NIN | క్యాటరాక్ట్‌కు సరైన మందు పసుపు, అల్లం.. ఆయుర్వేద దినుసులకు కంటి శుక్లాల సమస్యను తగ్గించే శక్తి: ఎన్ఐఎన్
మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో కంటి శుక్లాల పరిపక్వతను తగ్గించే శక్తి భారతీయ సంప్రదాయ ఆహారం, ఆయుర్వేద మందుల్లోనే ఉంది.
- జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
NIN | హైదరాబాద్ : మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో కంటి శుక్లాల పరిపక్వతను తగ్గించే శక్తి భారతీయ సంప్రదాయ ఆహారం, ఆయుర్వేద మందుల్లోనే ఉంది. పసుపు, ఉసిరి, మిరియాలు, దాల్చిన చెక్క, మెంతులు, అల్లం మిశ్రమంతోపాటు మొక్కల ఆధారిత ఆహారాన్ని వినియోగించడం వల్ల కంటి శుక్లాల పరిపక్వత తీవ్ర స్థాయికి చేరే వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. జాతీయ పోషకాహార సంస్థ (NIN) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మధుమేహ రోగులు మొక్కల ఆధారిత దినుసులను వినియోగించడం వల్ల కేటరాక్ట్తో పాటు అనేక ఇతర అస్వస్థతలను కూడా నిరోధించవచ్చునని శాస్త్రవేత్తలు వివరించారు.
పైన పేర్కొన్న ఆరు దినుసులను తినడం వల్ల డయాబెటిక్ కేటరాక్ట్లను నిరోధించవచ్చునని, కేటరాక్ట్ మెచ్యురేషన్ వేగాన్ని తగ్గించవచ్చునని తేలింది. ఇతర వ్యాధులతో బాధపడేవారితో పోల్చుకుంటే, మధుమేహ వ్యాధిగ్రస్థులకు కేటరాక్ట్ వచ్చే అవకాశాలు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. వీరి కంటిలో శుక్లం ఏర్పడిన తర్వాత వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. డయబెటిస్ లేనివారితో పోల్చుకున్నపుడు, మధుమేహ వ్యాధిగ్రస్థులకు కేటరాక్ట్ సర్జరీ చేస్తే, డయాబెటిక్ రెటినోపతీ వేగంగా వృద్ధి చెందుతుందని, అంతిమంగా దృష్టిని కోల్పోవడానికి దారి తీస్తుందని అధ్యయనాలు చెప్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

