హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీటీడీకి వస్తున్న నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది. టీటీడీకి వస్తున్న నిధుల్లో ఒక శాతం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయిస్తామని ప్రకటించి.. రూ.100 కో ట్లు పారిశుధ్య పనుల కోసం మళ్లించింది. ఈ చర్య సబబు కాదని పేర్కొంటూ బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవా రం కేసు విచారణకు రాగా, ఆలయ నిధు లు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్ 111కు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.