హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘టీటీఏ సేవా డేస్-2025’ కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.
హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, మెదక్‌తో సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో టీటీఏ అధ్యక్షుడు మల్లిపెడ్డి నవీన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ కంది విశ్వ, ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డి, ఐడ్వెజరీ కౌన్సిల్ చైర్మన్ విజయపాల్‌రెడ్డి, కో చైర్మన్ రెడ్డి పటోళ్ల, సలహా కమిటీ సభ్యులు మాదాడి భరత్‌రెడ్డి, అనుగు శ్రీని, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.