TSRTC legal notice to allu arjun | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌కు, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు టీఎస్ ఆర్టీసీ ( TSRTC ) ఎండీ వీసీ సజ్జనార్ ( Sajjanar ) పేర్కొన్నారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ( Rapido ) ప్రకటనపై అభ్యంతరాలు వచ్చాయని సజ్జనార్ తెలిపారు. ఆ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చారు. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు అని సజ్జనార్ తేల్చిచెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని సజ్జనార్ సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జూనియర్ బన్నీ రెడీ.. అల్లు అయాన్ వీడియోకు అదిరిపోతున్న రెస్పాన్స్..
అల్లు అర్జున్ సినిమాకు బంపర్ ఆఫర్.. హిందీ డబ్బింగ్‌కు భారీ ఆఫర్
అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!