హైదరాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ): అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మకమైన ఐదు ఎక్స్లెన్స్ అవార్డులను టీఎస్ ఆర్టీసీ గెలుచుకున్నది. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర క్యాటగిరీల్లో ఈ పురసారాలు దకాయి.
న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఏఎస్ఆర్టీయూ అధ్యక్షుడు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందజేశారు. జాతీయ స్థాయి అవార్డులు దకడం సంస్థకు ఎంతో గర్వకారణమని, ఇందుకు కృషిచేసిన 43 వేల టీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ఈ పురసారాలను అంకితం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.