TSRTC | ప్రయాణికులకు అందుబాటులోకి లహరి ఏసీ బస్సులు.. మొదట తిరుపతి, చెన్నైకి..
TSRTC | హైదరాబాద్ : ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన లహరి ఏసీ బస్సులు( Lahari AC Bus ) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులు గురువారం రోజు హైదరాబాద్( Hyderabad ) రోడ్లపై పరుగులు పెట్టాయి. హైదరాబాద్ - తిరుపతి( Tirupathi ), హైదరాబాద్ - చెన్నై( Chennai ) మధ్య రెండు ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
TSRTC | హైదరాబాద్ : ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన లహరి ఏసీ బస్సులు( Lahari AC Bus ) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులు గురువారం రోజు హైదరాబాద్( Hyderabad ) రోడ్లపై పరుగులు పెట్టాయి. హైదరాబాద్ – తిరుపతి( Tirupathi ), హైదరాబాద్ – చెన్నై( Chennai ) మధ్య రెండు ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్ – తిరుపతి ఏసీ స్లీపర్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు బీహెచ్ఈఎల్( BHEL ) వద్ద బయల్దేరుతుంది. సాయంత్రం 6:20 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మళ్లీ తిరుపతి నుంచి అదే రోజు రాత్రి 7:40 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8 గంటలకు బీహెచ్ఈఎల్కు చేరుకోనుంది.
హైదరాబాద్ – చెన్నై మార్గంలో ప్రయాణించే ఏసీ స్లీపర్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:25 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద బయల్దేరి, ఎంజీబీఎస్‌కు 6:20 గంటలకు చేరుకోనుంది. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7:30 గంటలకు చెన్నై నుంచి బస్సు బయల్దేరును. మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8:20 గంటలకు బీహెచ్ఈఎల్కు చేరుకోనుంది.
ఈ ఏసీ స్లీపర్ బస్సుల్లో 30 బెర్తుల చొప్పున ఉంటాయి. కింద 15, పైన 15 బెర్త్‌లు ఉంటాయి. ఇక ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు 040-69440000 లేదా 040-23450033 నంబర్లను సంప్రదించొచ్చు. లేదా www.tsrtconline.in. అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

