హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 21న నిర్వహించనున్నట్టు గురుకులాల సెక్రటరీ రమణకుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 73,527 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరి హాల్టికెట్లను సోమవారం విడుదల చేసినట్టు తెలిపారు.