హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : 2024 -25 విద్యాసంవత్సరంలో 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్ఆర్జేసీ) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tsrjdc.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 60వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని పేర్కొన్నారు.