తెలంగాణలో కొలువుల జాతర.. మరో మూడు నోటిఫికేషన్లు జారీ
TSPSC | తెలంగాణలో కొలువ జాతర కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్స్, పోలీస్, వైద్యారోగ్యశాఖ తదితర శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగల భర్తీకి
హైదరాబాద్ : తెలంగాణలో కొలువ జాతర కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్స్, పోలీస్, వైద్యారోగ్యశాఖ తదితర శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
విద్యాశాఖలో..
విద్యాశాఖలో మరో 71 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జనవరి 21వ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. మే లేదంటే జూన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో..
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, 1 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

