Group-1 Prelims | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో ఎదురైనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్ ఫోన్లను సైతం కేంద్రంలోకి అనుమతించలేదు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే.
పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లా కేంద్రాల్లో 994 సెంటర్లలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. ప్రశాంతంగా పరీక్ష ముగియడంతో అధికారులంతా ఊపిరిపీలుకున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 ప్రిలిమినరీకి సంబంధించిన సమాధానాలతో కూడిన ‘కీ’ని బాలలత, వినయ్ కుమార్ నేతృత్వంలోని CSB ఐఏఎస్ అకాడమీ రూపొందించింది.
Note : ఈ ‘కీ’ని కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ‘కీ’ని మాత్రమే ప్రమాణికంగా తీసుకోగలరు.