హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): 2024 సీజన్లో తునికాకు (బీడీ ఆకు) సేకరణకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎఫ్డీసీ)ని నోడల్ ఏజెంట్గా ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్) యాక్ట్-1973 ప్రకారం టీఎస్ఎఫ్డీసీని బీడీ ఆకు సేకరణ ఏజెంట్గా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.