TS Weather Update | రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో్ అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే సూచనలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. బుధవారం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానందనగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.