TS LAWCET | హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీన టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష మే 25వ తేదీన మూడు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. లాసెట్ ఫలితాల కోసం lawcet.tsche.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.