కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారం
కోకాపేట | కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై వస్తున్న ఆరోపణలు నిరాధారం అని రాష్ర్ట ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు ఆ భూముల వేలంపై ప్రభుత్వ వివరణ

హైదరాబాద్ : కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై వస్తున్న ఆరోపణలు నిరాధారం అని రాష్ర్ట ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు ఆ భూముల వేలంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరపున హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఇటీవల చేపట్టిన భూముల వేలంలో విధానపరమైన అవకతవకలు జరిగాయని కొన్ని వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై రికార్డుల ఆధారంగా ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత ఉన్నదని ప్రభుత్వం భావిస్తోంది.
నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాలకు సంబంధించి ప్రభుత్వ భూములను వేలం వేయడం అనేది గతంలో ఉమ్మడి రాష్ర్టంలోనూ, దేశంలోని వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్నది. ఢిల్లీలోని డెవలప్మెంట్ అథారిటీ, మహారాష్ర్ట, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి వివిధ రాష్ర్టాల్లో ఇలాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. రెవెన్యూ సముపార్జన అనేది దీని ముఖ్య ఉద్దేశ్యంగా అనిపిస్తున్నప్పటికీ, పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన వృద్ధి, పట్టణాల్లో రోజు రోజుకు పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడం దీని ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది.
ఈ ఏడాది జులై 5, 16వ తేదీల్లో జరిగిన వేలంలో కోకాపేట్కు సంబంధించి 49.45 ఎకరాల విస్తీర్ణం గల స్థలం 8 ప్లాట్లుగా, ఖానామెట్లో 15.01 ఎకరాల విస్తీర్ణం గల స్థలం 5 ప్లాట్లుగా వేలం వేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఈ వేలం పాటను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించామని తెలిపింది.
కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారం. భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదు. ఎవరైనా ఒక బిడ్ను ప్రభావితం చేస్తారనేది అపోహే. ఆన్లైన్లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం ఉంటుంది. 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్ ఖరారు అవుతుంది. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. భూముల వేలానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరికాదు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుంది. ఆరోపణలపై పరువు నష్టం చర్యలు తీసుకుంటాం. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నాం. పోటీని నివారించారని, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలు నిరాధారం. కొన్ని సంస్థలకు మేలు చేశారన్న ఆరోపణలు నిరాధారం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

