e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News TS EdCET 2021 | టీఎస్ ఎడ్‌సెట్ - 2021 ఫ‌లితాలు విడుద‌ల‌.. అమ్మాయిల‌దే హ‌వా

TS EdCET 2021 | టీఎస్ ఎడ్‌సెట్ – 2021 ఫ‌లితాలు విడుద‌ల‌.. అమ్మాయిల‌దే హ‌వా

హైద‌రాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్ – 2021 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. మాస‌బ్‌ట్యాంక్‌లోని ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలోని సెమినార్ హాల్‌లో చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి ఈ ప‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఎడ్‌సెట్‌లో 98.53 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు పేర్కొన్నారు. బీఎడ్ కోర్సులో ప్ర‌వేశాల‌కు 33,683 మంది విద్యార్థులు అర్హ‌త సాధించ‌గా, ఇందులో 25,983 మంది అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు తిమ్మిశెట్టి మ‌హేంద‌ర్(న‌ల్ల‌గొండ‌) సాధించ‌గా, రెండో ర్యాంకు ఎ ప్ర‌త్యూష‌(మంచిర్యాల‌), మూడో ర్యాంకు రిషికేశ్ కుమార్ శ‌ర్మ( పాట్నా) పొందారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఎడ్‌సెట్‌ – 2021 పరీక్షను ఆగ‌స్టు నెల‌లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 42,399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement