Telangana | తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పు.. షెడ్యూల్ కంటే ముందుగానే ఎంసెట్ పరీక్ష
Telangana | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ eapcet (ఎంసెట్) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే ఐసెట్ పరీక్షను ఒక్క రోజు పోస్ట్‌పోన్ చేసింది.
Telangana | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ eapcet (ఎంసెట్) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే ఐసెట్ పరీక్షను ఒక్క రోజు పోస్ట్‌పోన్ చేసింది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎప్‌సెట్ పరీక్షలు మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎప్ సెట్ తేదీల్లో మార్పులు చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం.. జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

