హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్‌ను జూన్ రెండోవారంలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మే మొదటి వారంలో ముగియనున్నాయి. నెల రోజుల విరామమిచ్చి ఎంసెట్ నిర్వహించాలనుకుంటున్నారు. గతంలోనే ఎంసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమించారు. తాజాగా ఎంసెట్సహా ఆరు సెట్లకు నిర్వహణకు కమిటీలను నియమించారు. మార్చిలో ఎంసెట్ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఎంసెట్ తేదీలపై టీసీఎస్‌ను ఆరా తీసిన అధికారులు, జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను బట్టి తేదీలను ఖరారుచేయనున్నారు. జూన్‌లోనే టీఎస్ఈసెట్, పీజీఈసెట్, జూలైలో ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.