హైదరాబాద్ : టీఎస్ సెట్ -2022 షెడ్యూల్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 30 నుంచి టీఎస్ సెట్ ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాల అర్హత కోసం టీఎస్ సెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం టీఎస్ సెట్ వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.