TS LAWCET | హైదరాబాద్ : టీఎస్ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా ఏప్రిల్ 20వ తేదీ లోపు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోని, తమకు దగ్గర్లోని సెంటర్లను ఎంచుకోవాలని సూచించారు.
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.