బీజేపీని ఎదుర్కొనేది టీఆర్ఎస్సే : సీపీఐ నేత నారాయణ
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతో
అంటకాగుతున్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు
మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై స్పందించిన నారాయణ.. ఏపీలో పరిస్థితులపై స్పందించారు. టీఆర్ఎస్కు సీపీఐకు రాజకీయంగా పెద్ద సంబంధాలు లేకపోయినా.. బీజేపీని అడ్డుకునేందుకే మద్దతు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆదివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బీజేపీని ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని స్పష్టత ఇచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సీపీఐ ఉందని, ఆ క్రమంలోనే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు వివరించారు.
అయితే, దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని నారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు.. మోదీ షేక్ హ్యాండ్కే మురిసిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ గూటిలోనే ఉన్నారన్నారు. విశాల ప్రయోజనాల కోసం బీజేపీని ఏపీలో పార్టీలు వీడి రావాలని కోరారు. బీజేపీతో వైఎస్సార్సీపీ అంటకాగితే.. కచ్చితంగా జగన్‌కి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ఏపీలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతారో ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | తెలంగాణ సెక్రటేరియట్‌లా కనిపిస్తుందంటూ చంద్రబాబు ప్రశంసలు
Revanth Reddy | సీఎం ఇలాకాలో గుడిపైకి బుల్డోజర్.. నందిపహాడ్లో దుర్మార్గం
సంకీర్ణాన్నిశాసించి పథకాలెన్నో సాధించి.. గడిచిన నాలుగు దశాబ్దాల్లో రుజువైందిదే!
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

