బీఆర్టీయూగా టీఆర్ఎస్కేవీ
బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.
- రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. ఇకపై బీఆర్టీయూ దేశవ్యాప్తంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సమావేశం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రామిక మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్టీయూగా మార్చినట్టు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కూడా బీఆర్టీయూకు అనుబంధంగా పని చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి చెప్పారు. అనంతరం శ్రామి క మహిళా రాష్ట్ర నాయకులు వేదవతి, సంతోష, సునీత, కరుణ, అనురాధ, శోభారాణి, బాబాయమ్మ, మంజులతో పాటు 40 మంది మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎల్ రూప్సింగ్, బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, అన్ని జిల్లాల ట్రేడ్ యూనియన్, వివిధ రంగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

