Home
Telangana
Trs Mlc Kavitha To Open Telangana Pavilion At American Telugu Association Meet In Usa
ఆటా సభలకు ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే మహాసభలు, యూత్ కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2న మహాసభల్లో భాగంగా మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ప్రైమ్ మీట్‌కు ఆమె అతిథిగా హాజరవుతారు. అనంతరం బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈ సారి మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. మహాసభ ఏర్పాట్ల కోసం 80 కమిటీలు శ్రమిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

