భూ నిర్వాసితులు టీఆర్ఎస్ వైపే..
మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. రాష్టంలోని అధికార పార్టీతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు భూ నిర్వాసితులు అధిక శాతం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓట్లు వేశారు.
- అభివృద్ధిని కోరుకున్న నాంపల్లి ప్రజలు
- మండలంలో 2,336 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యం
నాంపల్లి / మర్రిగూడ నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. రాష్టంలోని అధికార పార్టీతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు భూ నిర్వాసితులు అధిక శాతం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓట్లు వేశారు. లక్ష్మణాపురంలోని పోలింగ్ బూత్ నంబర్ 266లో 709 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 489 ఓట్లు టీఆర్ఎస్కు రాగా, బీజేపీకి 156 ఓట్లే పడ్డాయి. నాంపల్లి మండలవ్యాప్తంగా టీఆర్ఎస్కు మంచి మెజారిటీ వచ్చింది. టీఆర్ఎస్కు 13,900 ఓట్లు రాగా, బీజేపీకి 11,564 ఓట్లు పడ్డాయి. దాంతో కారుకు 2,336 ఓట్లు అధికంగా వచ్చాయి.
ఆ రెండు గ్రామాల్లోనూ టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం
నాంపల్లి మండలం దామెర గ్రామంలో రెండు పోలింగ్ బూత్‌ల్లోనూ టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చింది. బూత్ నంబర్ 264లో టీఆర్ఎస్కు 468 ఓట్లు పడగా, బీజేపీకి 196 ఓట్లే వచ్చాయి. బూత్ నెంబర్ 263లో టీఆర్ఎస్కు 279 ఓట్లు రాగా, బీజేపీకి 109 ఓట్లే పడ్డాయి. దామెరలో బీజేపీకి 305 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 747 ఓట్లే వచ్చాయి. మొత్తం టీఆర్ఎస్కు 442 ఓట్ల మెజార్టీ లభించింది. ఎస్డబ్ల్యూ లింగోటంలోని 256 బూత్‌లో టీఆర్ఎస్కు 621 ఓట్లు రాగా, బీజేపీకి 338 ఓట్లే పడ్డాయి. 266 బూత్‌లో టీఆర్ఎస్కు 489 ఓట్లు పడగా, బీజేపీకి 156 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 1,110 ఓట్లు రాగా, బీజేపీకి 542 ఓట్లే వచ్చాయి. దాంతో ఇక్కడ టీఆర్ఎస్కు 568 ఓట్ల మెజారిటీ లభించింది.
టీఆర్ఎస్కు జై కొట్టిన మర్రిగూడ ప్రజలు
మర్రిగూడ మండల ఓటర్లు టీఆర్ఎస్కు జై కొట్టారు. ఏకంగా 2,967 ఓట్ల మెజారిటీ ఇచ్చి గులాబీ పార్టీ గెలుపునకు కీ రోల్ గా మారారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన మర్రిగూడ మండల ప్రజలు.. మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇంటింటికీ కృష్ణ జలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఓట్ల రూపంలో కృతజ్ఞత చూపారు. శివన్నగూడెం ప్రాజెక్టును నిర్మిస్తూ ఈ ప్రాంత వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వాన్ని విశ్వసించారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న చర్లగూడెం, నర్సిరెడ్డి గూడెం, వెంకే పల్లి, వెంకేపల్లి తండా నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మండలంలో 25, 877 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 12,024 ఓట్లు రాగా, బీజేపీకి 9,007 ఓట్లే పడ్డాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

