సంగారెడ్డి : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy ) గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్(Sevalal)ను అవమానించడంపై గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అతడి దిష్టిబొమ్మల(Effigy )ను దహనం చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని సిర్గాపూర్ మండలంలోని లక్ష్మణ్ నాయక్ తండలో స్థానిక సర్పంచ్ సోనీ బాయి, నాయకులు రాజు నాయక్ ఆధ్వర్యంలో తండా ప్రజలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డికి సేవలాల్ మహారాజ్ చిత్రపటాన్ని అందజేస్తుండగా కనీస మర్యాద లేకుండా అగ్రకుల దురంహకారం ప్రదర్శించాని గిరజనులు ఆగ్రం వ్యక్తం చేశారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.