రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి : ‘ట్రెసా’
రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు సచివాలయంలో వారిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు సచివాలయంలో వారిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ల సేవల కొనసాగింపు అంశాన్ని కూడా మంత్రికి వివరించినట్టు చెప్పారు. వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేయబడిన ఉద్యోగులకు సీపీటీ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు.
రక్షణరంగ పీఎస్‌యూల్లో నిఘా బలోపేతానికి శిక్షణ
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రక్షణ, ప్రభుత్వరంగ సంస్థ ల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సమగ్రత బలోపేతమే లక్ష్యంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్‌షాప్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘రక్షణ, ప్రభుత్వరంగ సంస్థల్లో నిఘా పరిపాలన’ అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు 16 రక్షణ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన చీఫ్ విజిలెన్స్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వశాఖ రక్షణ ఉత్పత్తి విభాగం అదనపు కార్యదర్శి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ దినేశ్ మహూర్, బీడీఎల్ డైరెక్టర్(టెక్నికల్) డీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

