హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఒక రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించే ట్రావెల్ యాజ్ యూలైక్ (టీఏవైఎల్) టికెట్లు ఇకపై అన్ని ఆర్టీసీ బస్సుల్లో లభించనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లోనూ లభిస్తాయని సంస్థ ఎండీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. టీఏవైఎల్ టికెట్ ధరను సైతం రూ.100 నుంచి రూ.80కి తగ్గించినట్టు చెప్పారు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందని ఎండీ పేర్కొన్నారు.