చిరుధాన్యాలతో రెడీమేడ్ ఫుడ్స్‌పై శిక్షణ
- వ్యాపార అవకాశాల వేదిక న్యూట్రిహబ్

హైదరాబాద్, జూలై 5 (నమస్తేతెలంగాణ): వ్యవసాయరంగంలో ఏదైనా చేయాలనే వినూత్న ఆలోచనలు ఉన్నాయా? ఆ ఉత్పత్తులతో వ్యాపారవేత్తగా ఎదగాలనుకొంటున్నారా? రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూట్రిహబ్ సహకారం అందించేందుకు రెడీగా ఉన్నది. దేశంలో పౌష్ఠికాహార లోప నివారణే ధ్యేయంగా పనిచేస్తూ, చదువుకొన్న యువత వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తున్నది. ట్రైనింగ్ పూర్తయ్యాక ప్రాజెక్టుకు సదుపాయం కూడా కల్పిస్తున్నది. చిరుధాన్యాలతో తయారైన రెడీమేడ్ ఫుడ్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని న్యూట్రిహబ్ను ఏర్పాటుచేశారు. న్యూట్రిహబ్ ఇప్పటివరకు దాదాపు 250 స్టార్టప్‌లకు సేవలు అందించింది. ఆర్కేవీవై రఫ్తార్ పథకం ద్వారా ఈ ఏడాది 40 స్టార్టప్‌లకు రూ.3.40 కోట్ల ప్రోత్సాహక ఫండ్ సమకూర్చింది. హబ్ ద్వారా ఇప్పటికే 3 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తయ్యిందని, ప్రస్తుతం నాలుగో బ్యాచ్ కొనసాగుతున్నదని న్యూట్రిహబ్ సీఈవో దయాకర్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cereals
- Readymade Foods
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

