మాదాపూర్, డిసెంబర్ 1: నిర్మాణ రంగంలో వేలాదిమందికి నైపుణ్య శిక్షణ అందిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) అత్యాధునిక సాంకేతికతతో కూడిన షీర్వాల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నది.
ఈ మేరకు గురువారం విపుల్ ఫార్మ్, అల్యూమినియం ఫార్మ్వర్క్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ కార్యక్రమంలో న్యాక్ జనరల్ డైరెక్టర్ కే భిక్షపతి, ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీ పాల్గొన్నారు.