హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మల్బరీ సాగుపై ఎల్ నినో ప్రభావా న్ని తగ్గించి పంట నాణ్యత, దిగుబడిని కాపా డే లక్ష్యంతో సోమవారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ సెరి కల్చర్ కార్యాలయంలో సి ల్క్ వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ని ర్వహిస్తున్నట్టు పట్టు పరిశ్రమశాఖ అధికారు లు తెలిపారు. శిక్షణ అనంతరం సిల్క్ వలంటీర్లు గ్రామస్థాయిలో రైతులను కలిసి ఎల్ ని నో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, దిగుబడి పెం పునకు అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రా ష్టంలోని మల్బరీ సాగుచేసే 8 జిల్లాల నుంచి మొత్తం 34 మంది సిల్క్ వలంటీర్లు శిక్షణలో పాల్గొంటారని పట్టుపరిశ్రమ శాఖ అధికారి శక్రూనాయక్ వెల్లడించారు.