హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో టికెట్ల జారీకి క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు గురువారం అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులకు టికెట్ కోసం క్యూలో నిలబడే బాధ తగ్గుతుందని పేర్కొన్నారు.
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహంలో భాగంగా యూటీఎస్ కౌంటర్లలో అధునిక పరికరాలతో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జోన్ వ్యాప్తంగా మొత్తం 879 క్యూఆర్ పరికరాలను యూటీఎస్ కౌంటర్లలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొబైల్లోని పేమెంట్ యాప్ ద్వారా స్కాన్ చేసి, టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.