ఐనవోలు, ఆగస్టు 28 : తల్లి శవయాత్ర కొనసాగుతుండగానే ఓ కొడుకు గుండె ఆగిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఐనవోలుకు చెందిన కొండేటి మల్లికాంబ(65) ఇటీవల కాలు విరిగి ఇన్ఫెక్షన్ అయి, పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. మల్లికాంబకు కొడుకులు సమ్మయ్య, రవి ఉన్నారు. చిన్న కొడుకు రవి (31) మల్టీపర్పస్ వర్కర్. అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
తల్లి మరణ వార్త తెలుసుకున్న కుమారుడు మనోవేదనకు గురయ్యాడు. తలకొరివి పెట్టేందుకు ఓపిక లేకపోవడంతో రవి పెద్ద కొడుకు దక్షిత్ తో నానమ్మకు తలకొరివి పెట్టించారు. తల్లి శవయాత్ర కొనసాగుతుండగానే రవి అస్వస్థతకు గురై మృతిచెందాడు. దక్షిత్ ఉదయం నానమ్మ, రాత్రి తండ్రికి తలకొరివి పెట్టిన ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించింది.