Traffic Alert | నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్‌లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్‌లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అటునుంచి నేరుగా రాజ్‌భవన్‌కు (Rajbhavan) చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్‌లోని (Dundigal) ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. సీటీఓ జంక్ష న్, పీఎన్బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, వీవీ విగ్రహం జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. అందువల్ల ఆయా రూట్లలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- సికింద్రాబాద్ నుంచి బేగంపేట మీదుగా అమీర్‌పేట్, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్లో రాకుండా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై దారి మళ్లించనున్నారు.
- రాజ్‌భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ విగ్రహం (ఖైరతాబాద్) మార్గాల్లో రెండు వైపులా రోడ్ మూసివేశారు.
- పంజాగుట్ట రాజభవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు.
- సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్‌పురా జంక్షన్ వద్ద కొద్దిసేపు నిలిపివేస్తారు.
- పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాశ్ నగర్ టీ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆపివేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

