Traffic alert | హైదరాబాద్‌లో 90 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వాహనాల రాకపోకలు బంద్
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో (IT Corridor) ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్లు, రహదారులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద (Shilpa layout) నూతన ఫ్లై ఓవర్ (Flyover) నిర్మాణం చేపట్టింది. ఈనేపథ్యంలో ఐటీ కారిడార్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో (IT Corridor) ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్లు, రహదారులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద (Shilpa layout) నూతన ఫ్లై ఓవర్ (Flyover) నిర్మాణం చేపట్టింది. ఈనేపథ్యంలో ఐటీ కారిడార్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. మే 13 నుంచి ఆగస్టు 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇందులోభాగంగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు వాహనాలను దారిమళ్లించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్ టు కొండాపూర్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
దారి మళ్లింపు ఇలా…
- గచ్చిబౌలి ఔటర్ నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలను గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫ్లైవోవర్ వద్ద దారి మళ్లించి, మీనాక్షి టవర్స్, డిలైట్, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్ రహదారి మీదుగా కొత్తగూడ ఫ్లైవోవర్, కొండాపూర్, హఫీజ్‌పేట్ మీదుగా అనుమతిస్తారు.
- లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద దారి మళ్లించి, డీఎల్ఎఫ్ ఐటీ పార్క్, రాడిసన్ హోటల్ మీదుగా కొండాపూర్ వైపు అనుమతిస్తారు.
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్‌కాలనీ వైపు వెళ్లే వాహనదారులు, ట్రిపుల్ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద యూ టర్న్ తీసుకొని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి డీఎల్ఎఫ్ ఐటీ పార్క్, రాడిసన్ హోటల్, కొండాపూర్ మీదుగా ఆల్విన్‌కాలనీ వైపు వెళ్లాలి.
- టోలిచౌకి ప్రాంతం నుంచి ఆల్విన్ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని మైండ్‌స్పేస్, సైబర్ టవర్స్ జంక్షన్ మీదుగా హైటెక్స్ జంక్షన్ కొత్తగూడ, కొండాపూర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- గచ్చిబౌలి టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైవోవర్ కింద యూ టర్న్ తీసుకొని శిల్పా లేఅవుట్ ైఫ్లైవోవర్, మీనాక్షి టవర్స్, డిలైట్, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్ మీదుగా కొత్తగూడ, కొండాపూర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- ఆల్విన్ కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు కొత్తగూడ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని హైటెక్స్ రోడ్, సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ జంక్షన్, శిల్పా లేఅవుట్ ఫ్లైవోవర్ మీదుగా గచ్చిబౌలి వెళ్లాల్సి ఉంటుంది.
- ఆల్విన్‌కాలనీ జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని శ్రీరాంనగర్ కాలనీ, మజీద్బండా, హెచ్‌సీయూ డిపో మీదుగా లింగంపల్లి వెళ్లాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

