హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : జపాన్ దేశంలో పనిచేసేందుకు నర్సింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఈ నెల 26న మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ కాలేజీ ఆఫ్ నర్సింగ్‌లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సీఈవో తెలిపారు. వివరాలకు 6302292450, 8919047600 లేదా www.tomcom.telangana.gov.inను సంప్రదించాలని కోరారు.