హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాట ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో టమాట ధర భారీగా తగ్గింది. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో ధర రూ.196 పలికింది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం రూ.100కు తగ్గింది. తాజాగా గురువారం ఏ గ్రేడ్ టమాట కిలో ధర రూ.50-64గా ఉండగా, బీ-గ్రేడ్ ధర రూ.36-48కు పడిపోయింది.