రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నేడు

- ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాలు ఎజెండా
- భూమి విలువ సవరణపై చర్చ
- కరోనా థర్డ్‌వేవ్‌పై అప్రమత్తత
- వానకాలం సాగుపై నిర్ణయాలు
- పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు శాఖలవారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన ఆర్థికశాఖ అధికారులు సమగ్రమైన నోట్‌ను రూపొందించారు. దీనిపై చర్చించనున్న క్యాబినెట్ ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయనున్నది. కృష్ణాపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించనున్నది. ముఖ్యంగా సీమ ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కరోనా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చించనున్నది. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

