హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్లు, ఇండస్ట్రీయల్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొన్నిచోట్ల సెలవు ఇవ్వడంలేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటి సంస్థలపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.