హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం సమగ్రమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టీజీవో భవన్లో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ తెలిపారు. టీఎస్పీఎస్పీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా 2016 గ్రూప్-2 టాపర్స్ రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని టీజీవో భవన్లో మంగళవారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు మార్కెట్లో సరైన స్టడీ మెటీరియల్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి ఇబ్బందులను గుర్తించి స్టడీ మెటీరియల్ను టాపర్స్ అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు.