తెలంగాణ స్కీమ్స్ కావాలి
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ఏటా జూలై 5న తమిళనాడు రాష్ట్ర రైతు దినోత్సవం నిర్వహించుకోవడం అక్కడ ఆనవాయితీ
దేశమంతా అమలుకు రైతు సంఘాల డిమాండ్.. తమిళనాడులోని కృష్ణగిరిలో భారీ సభ
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ఏటా జూలై 5న తమిళనాడు రాష్ట్ర రైతు దినోత్సవం నిర్వహించుకోవడం అక్కడ ఆనవాయితీ. తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో పలు రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి వసతి కల్పన కార్యక్రమాలను ప్రశంసించారు. కల్యాణలక్ష్మి, గురుకుల విద్య, ఆసరా పెన్షన్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ పథకాల వల్ల రైతులకు కలుగుతున్న మేలును వివరించారు. ఇలాంటి పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే.. రైతుల కష్టాలు తీరుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయరంగానికి అధిక నిధులు కేటాయిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారని కొనియాడారు. రైతుబంధు ద్వారా రైతులకు రూ. 58 వేల కోట్లు పంపిణీ చేసిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో తమిళనాడు వ్యవసాయ సంఘాల జేఏసీ చైర్మన్ పీకే దైవ శిగామణి, కర్ణాటక రైతు సంఘాల చైర్మన్ కే శాంతకుమార్, తమిళనాడు రైతు సంఘం అధ్యక్షుడు రామగౌండర్, ఉత్తరాంధ్ర కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు గాడి శివకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

